
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో హుజూరాబాద్ లో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా కళాకారులు పాటలు పాడుతూ డప్పు సప్పులతో సందడి చేస్తూ స్థానిక మునిసిపాలిటీ కార్యాలయం నుండి జమ్మికుంట రోడ్ మీదుగా సూపర్ బజార్, వెంకటరమణ థియేటర్ గల్లి నుండి అంబేద్కర్ సర్కిల్ నుండి వరంగల్ రోడ్, DCMS కాంప్లెక్స్, గాంధీనగర్ రోడీ, నుండి కరీంనగర్ రోడ్ గుండా తిరిగి జమ్మికుంట మసీదు గుండా MPDO ఆఫీసు, మార్కెట్ లో తిరిగి సేకరించడం ముగించారు. సేకరించిన విరాళాలను ఖమ్మం వరద బాధితులకు పంపించడం జరుగుతుందని నిరుద్యోగ కళాకారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి షౌకత్ సౌండ్స్ (పాషా రికార్డింగ్ స్టూడియో) సహకరించగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనువోజు వెంకటేషంతో పాటు కళాకారులు మునిగంటి సతీష్ (ఉపాధ్యక్షులు) డోలక్ రాజు (ప్రధాన కార్యదర్శి), చంద్రశేఖర్, కుమారస్వామి, కార్తీక్, నరేష్, రజిని, స్వరూప, బాబు, రాజేశ్, మహేష్, మహేందర్, రాజశేఖర్, దాసారపు కుమార్, రాజశేఖర్, బండారి శంకర్, రఘురాంగౌడ్, వెంకటేశ్, కూన రమేష్ తదితరులు పాలా న్నారు.