
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ డైరీ ఎండి పందిళ్ళ శంకర్ రెడ్డి సతీమణి పందిళ్ళ దేవేంద్ర అనారోగ్యంతో పరమపాదించారు. హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ నివాసంలో అమే పార్థివ దేహాన్ని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన వెంట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, ఉపాధ్యక్షులు యాంసాని శశిధర్, యాళ్ల సంజీవరెడ్డి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు బొరగాల సారయ్య తదితరులు పాల్గొన్నారు.







