స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం స్వర్గస్తులయ్యారు. కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి.
మా కుటుంబంలో తీవ్ర విచారంతో మా పెద్దనాన్న పురుషోత్తంరెడ్డి అనారోగ్యంతో మరణించారు. తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించి, మా పెద్దనాన్న పురుషోత్తంరెడ్డి భౌతిక కాయానికి మర్యాదపూర్వకంగా నివాళులు అర్పించాను అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. అలాగే పురుషోత్తం రెడ్డి మృతి పట్ల మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్కతో పాటు పలువురు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉత్తంకుమార్ రెడ్డికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వేరువేరు ప్రకటనల్లో వ్యక్తం చేశారు.