
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అక్టోబర్ 2 జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సాహితీ ఫౌండేషన్ (ఎన్ జి ఓ ) చైర్మన్ రాముల కుమార్ ఆదేశాల మేరకు ఫౌండేషన్ కో ఆర్డినేటర్ మహమ్మద్ అంకుష్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలో జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవ ర్యాలీ ని చేపట్టనున్నట్లు కోఆర్డినేటర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య మాదకద్రవ్యాల బారిన పడి యువత చెడిపోతున్నారని, బంగారు లాంటి భవిష్యత్తును నాశనం చేసుకొని సమాజంలో దేనికి ఉపయోగపడని వ్యక్తులుగా తయారవుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాన్ టీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా మన హుజురాబాద్ పట్టణంలో అవేర్నెస్ ర్యాలీ వ్యవసాయ మార్కెట్ దగ్గర నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాత ఎల్ఐసి బిల్డింగ్ వరకు బుధవారం ఉదయం 7గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు, పత్రిక మిత్రులు పాల్గొని యువతను చెడు వ్యసనాలకు లోను కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని విజ్ఞప్తి చేశారు.

