Oplus_16908288
–అమ్మవారికి చీర, సార సమర్పణ ఆనవాయితీ కొనసాగింపు
–అలంకరణలో జోగిని బురగల అజయ్ కుమార్ సేవలు ప్రశంసనీయం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చి 18: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని స్థానిక పోచమ్మ ఆలయానికి సంప్రదాయ కానుకలు సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఆలయ కమిటీకి కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీర, సార సమర్పించారు. ఉగాది రోజున పోచమ్మ ఆలయానికి, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఏటా అమ్మవారికి అలంకరణ నిర్వహిస్తున్న హుజురాబాద్ వాసి జోగిని బురగల అజయ్ కుమార్ సేవలను ఈ సందర్భంగా చైర్ పర్సన్ రొంటాల సుహాసిని ప్రశంసించారు. ఆయన ఆధ్వర్యంలో అమ్మవారు శోభాయమానంగా అలంకరించ బడుతుందని అన్నారు. ఉగాది సందర్భంగా ఆలయంలో సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గూడూరు అంజలి, స్థానిక ప్రజలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

జోగిని బురగల అజయ్ కుమార్ కు అమ్మవారి చీర సార అందజేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, పాలకవర్గ సభ్యులు..





