
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్-లోని అయిన నివాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యా రంగంలో విశేషంగా కృషి చేస్తున్న నరేందర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మధుసూదన్ రెడ్డి, కె రాము తదితరులు పాల్గొన్నారు.







