
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : సాహితి ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ రాముల కుమార్ ఆదేశాల మేరకు బుధవారం హుజురాబాద్ పట్టణంలో నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా అవేర్నెస్ కార్యక్రమం 2కె రన్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ జండా ఊపి మారథన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఆరోగ్యాలను పాడు చేసుకుని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారని, అటువంటి యువతను మంచి మార్గములో నడపడం కోసం సాహితి ఫౌండేషన్ చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మాట్లాడుతూ విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారి కుటుంబాలకు ఆసరాగా లేకుండా పోతున్నారని, సమాజాన్ని రక్షించాల్సిన విద్యార్థులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి యువతకు మార్గదర్శకంగా సాహితి ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సాహితి ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొలిపాక రమేష్, ఫౌండేషన్ కో ఆర్డినేటర్లు ఏనుగు మహిపాల్ రెడ్డి, కొండం శ్రీధర్ రెడ్డి, సంతోష్, మహమ్మద్ అంకుష్, కొండల్ రెడ్డి, చైతన్య రెడ్డి, మహేష్, ప్రశాంత్, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ పిడి కొన్ని రాజిరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి నాయకులు, 200 మంది వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.








