
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (వీణవంక) హుజురాబాద్: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో చెట్లను నరికి ప్రకృతి విధ్వంసానికి పునుకున్నారు. ఒకవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యావరణ సమతుల్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వనమహోత్సవ కార్యక్రమంలో గ్రామ గ్రామాన నర్సరీ ఏర్పాటు చేసి, బృహత్తరమైన చెట్ల పెంపకాన్ని చేపడుతుంటే, బేతిగల్ గ్రామంలో మాత్రం గ్రామపంచాయతీ అధికారులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ, పై అధికారులకు తెలియకుండా, మూకుమ్మడిగా ఊర చెరువు కట్ట పైనున్న చెట్లను తొలగించి, సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం చెరువు కట్ట పై గుట్టు చప్పుడు కాకుండా చెట్లను తొలగించి ట్రాక్టర్ సహాయంతో ఒక లోడును తరలించగా, ఆదివారం కూడా ట్రాక్టర్ లో మరో లోడ్ చేసి అక్రమంగా తరలిస్తుండగా, గ్రామస్తులు ఆ విషయాన్నీ జిల్లా నీటిపారుదల శాఖ డిఈఈ రవీందర్ కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అయన ఇరిగేషన్ కు సంబంధించిన ముగ్గురు లష్కర్ లను పంపించగా అప్పటికే కింద కలపను అన్లోడ్ చేసి పరారయ్యారు. అయితే కారోబార్ దగ్గర ఉండి కలపను నరికివేయించడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తతంగమంతా స్పెషల్ ఆఫిసర్ కి తెలియకుండా చేయడంపై స్పెషల్ అఫిసర్ కరణ్ కుమార్ సైతం జీపీ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కలప నరికివేతకు భారీ మొత్తంలో చేతులు మారినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే మండలంలోని పలు గ్రామాలలో చెరువు కట్టలపై ఉన్న చెట్లను నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తులు తొలగించినట్లయితే వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోబడతాయని డిఈ రవీందర్ హెచ్చరించారు. సోమవారం బేతిగల్ లో క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతామని ఆయన తెలిపారు.







