
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ వివిధ పార్టీ నాయకులతో ఓటర్ లిస్ట్ లపై హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్లు నమోదు మరియు ఏమైనా ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులు ఉంటే చేయాలని ఈ సందర్భంగా ఆర్డీవో చెప్పారు. ఓకె కుటంబం కు సంబందించిన ఓటర్లు వివిధ బూత్ లో ఉంటే వారిని ఒకే బూత్ లో ఉండే విధంగా bloలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలనీ సూచించారు. అదే విధంగా వివిధ పార్టీల నుండి ఓటర్ లిస్ట్ ల పై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, సిపిఎం మండల ఇంచార్జ్ కొప్పుల శంకర్, టీడీపీ నేత కామణి రాజేష్, బిఆర్ఎస్ నేత ములుగు శ్రీనివాస్, బిఎస్ పి మంద సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

