
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తపాల శాఖ వారోత్సవాలు ఈనెల 7 నుండి 11 వరకు దేశమంతటా నిర్వహించడం జరుగుతుందని, ఈ నేషనల్ పోస్టల్ వీక్ లో భాగంగా హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయంలో జాతీయ ఫిలాటెలీ దినోత్సవంను హుజురాబాద్ అసిస్టెంట్ సూపర్డెంట్ ఏ మోహన్, హుజురాబాద్ పోస్ట్ మాస్టర్ పి అమర్నాథ్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిలాటెలీ స్టాంపులను ప్రదర్శనకు ఉంచారు. కింగ్స్ ఆఫ్ హాబీగా “స్టాంపులు సేకరించడం (ఫిలాటెలీ)” అని మోహన్ తెలిపారు. ఈ స్టాంపుల ప్రదర్శనకి విచ్చేసిన విద్యార్థులకు ఫిలాటెలీ గురించి వివరించి, విద్యార్థులతో 20 ప్రశ్నలతో కూడిన ఫిలాటెలీ ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్షా అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపర్డెంట్ ఏ మోహన్, హుజురాబాద్ పోస్ట్ మాస్టర్ పి అమర్నాథ్ రెడ్డి, మిగతా తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

