మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్టెతస్కోప్ పట్టి నాడీ చూడాల్సిన వైద్యులు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడిన తీరు పలువురిని ఆకట్టుకుంది. లయబద్ధంగా కోలాటం ఆడుతూ పాటలు పాడుతూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ప్రకృతిని ఆరాధించే అతి పెద్ద వేడుక బతుకమ్మ పండుగ అని, ఇది భూమండలంలోనే ఒక తెలంగాణలోనే ప్రకృతిని ఆరాధించే గొప్ప వేడుక అని దవఖాన సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ సుధాకర్ రావు, ఏవో నారాయణరెడ్డి, హాస్పిటల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.