మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదుపై వారికీ పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల ప్రధాన డిమాండ్ అయిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు తన వంతు కృషి చేస్తానని, ఈ అంశము ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందని, ప్రతిపాదిత చట్టం త్వరలో వాస్తవరూపం దాల్చుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా యువ న్యాయవాదులకు 5వేల రూ. గౌరవ వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. చాలా చోట్ల కోర్టులు అద్దె భవనాల్లో కొనసాగుతుందని కనీస మౌలిక సదుపాయాలు లేక న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పక్క భవనం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.