
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని జమ్మికుంట రోడ్డులోని సిరిసపల్లి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు పక్కనే బావి ప్రమాదకరంగా ఉంది. జమ్మికుంట రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు వెళుతుంటాయి సిరసపల్లి క్రాస్ రోడ్డు నుండి హుజురాబాద్ కు వచ్చే మార్గంలో బావి ఉంది, దానికి అడ్డుగా ఎలాంటి గోడ నిర్మాణం బావి యజమానులు కానీ, అధికారులు గాని చేపట్టలేదు. దీంతో మూలమలుపు వద్ద ఉన్న ఈ భావి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అక్కడ బావి ఉందని తెలియని వారికి వేగంగా మూలమలిగే వారికి ప్రమాదం జరిగే అవకాశం మెండుగా ఉందని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ అన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదానికి నిలయంగా మారిన ఆ భావి పక్కన గోడ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకొని జరగబోయే ప్రమాదాలను నివారించాలని సామాజిక కార్యకర్త వేణుగోపాల్ కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేసేందుకు కూడా వెనకాడనని ఆయన స్పష్టం చేశారు.

సిర్సపల్లి క్రాస్ రోడ్ వద్ద ప్రమాదకరంగా మారిన బావిని చూపెడుతున్న సామాజిక కార్యకర్తల నలుబాల వేణుగోపాల్…





