మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజాసామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని, ఏఐపిఆర్.ఎఫ్ కన్వీనర్ గా ఉంటూనే, తెలంగాణ ఉద్యమం న్యాయ బద్ధమైనదని, ఉద్యమాన్ని బలపరిచిన వ్యక్తి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉంటూనే, మెరుగైన సమాజం కోసం, ప్రజాస్వామ్యతమైన భవిష్యత్తు కోసం, సమ సమాజాన్ని కలలుగన్నాడు. ఆదివాసుల మీద, దళితుల మీద, పేదల మీద, జరుగుతున్న దోపిడీని అణచివేతని వ్యతిరేకించాడు, అడవిలోని ఖనిజ బనుల దోపిడి కోసం జరుగుతున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వ్యతిరేకించాడు. ఈ ప్రతిఘటనను సహించని ప్రభుత్వం, అతడికి మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయి అనే బూటకపు కేసులో ఇరికించి, పది సంవత్సరాలపాటు క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించి అండాసెల్ లో బంధించారు. ఉద్యోగంలో నుంచి తొలగించారు. నేరం నిరూపణ కాకున్నా, విచారణనే శిక్షగా మలిచారు. 90 శాతం వికలాంగుడు అనే జాలి, దయ కూడా లేకుండా, అతనికి అవసరమైన మందులను కూడా జైల్లో అందకుండా చేశారు. 2015లో అరెస్టు కావడానికి ముందు ఆరోగ్యంగా ఉన్న సాయిబాబా జైల్లోకి వెళ్లాక, రోజుకు 26 టాబ్లెట్స్ వేసుకునే పరిస్థిలోకి వచ్చాడు, రెండుసార్లు కోవిడ్ బారిన, ఇంకొకసారి స్వైన్ ఫ్లూ బారిన పడ్డాడు. అయినా గాని అతని పట్ల పాలకుల ధోరణి మారలేదు. స్వయంగా కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని ఒక వికలాంగుడి పట్ల ఇంత క్రూరమైన విధానాన్ని అవలంబించడం,ఈ దేశ ప్రజాస్వామ్యా, పతనావస్థకు ఒక ఉదాహరణగా అభిప్రాయపడుతున్నాం. ఇది సాయిబాబా సాధారణ మరణమని మేము అనుకోవట్లేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన వ్యవస్థీకృతమైన హత్య.
ఈ దేశంలో ప్రజాస్వామికమైన హక్కులు రోజురోజుకీ కాలరాయపడుతున్న ఈ సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా లాంటి ఆలోచనపరుడు, మేధావి, ఉద్యమకారుడు, చనిపోవడమనేది భారతదేశ హక్కుల ఉద్యమానికి జరిగిన పెద్ద నష్టంగా పరిగణిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, డిటిఎఫ్ స్టేట్ ఎడిట్ కమిటీ మెంబర్ వేల్పుల రత్నం, ఎంఐఎఫ్, బిమోజు సదానందం, పొడిశెట్టి వెంకటరాజ్యం మాజీ ఎంపిపి, ఆళ్ల కేశవులు, కొల్లూరు బుచ్చయ్య, అన్నాడి సత్తిరెడ్డి, మాడుగుల ఓదన్న, బొడ్డు ఐలయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ, నమిండ్ల రవీందర్ మాజీ సర్పంచ్, రామ్ సారన్న, కటూరి రాజేందర్, మలుగూరి కొమురయ్య, మోరే సతీష్, మిడిదొడ్డి శ్రీనివాస్, మట్టెడ ప్రకాష్, తునికి సమ్మయ్య, చదిరం సారంగం, కండె తిరుపతి వేల్పుల ప్రభాకర్, సంధ్యల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
*పత్రికా ప్రకటనలు*