రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అప్పగించి మోసపోవద్దు.! -కలెక్టర్ పమేలా సత్పవతి

-నేరుగా కేంద్రాల్లోనే అప్పగించాలి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
బుధవారం రామడుగు మండలం వెదిర రైతువేదిక వద్ద, గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి, టి సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 2320, బి గ్రేడ్ ధాన్యానికి 2300 అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ పంటను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల లోనే విక్రయించాలన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రంచాలని,. రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు.రైతులు తమ పంటను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల లోనే విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, డీఆర్డీఓ శ్రీధర్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!