–శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మహిళలు మగ్గం వర్క్ నేర్చుకొని స్వయం ఉపాధికి బాటలు వేసుకోవాలని బై రైడ్ డైరెక్టర్ నాగరాజు కుమార్ తెలిపారు. బుధవారం కరీంనగర్ మండలం మల్కాపూర్ గ్రామంలో బై రాడ్ వారి ఆర్థిక సహకారంతో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమాన్ని బైరైడ్ డైరెక్టర్ నాగరాజు కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి బైరైడ్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ మహిళలు మగ్గం వర్క్ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలని, ఈ శిక్షణ కార్యక్రమాము 40రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉచిత రా మెటీరియల్ తోపాటు ఉచిత భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేయడంతో పాటు వారికి ఉపాధికి అవకాశ మార్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కరీంనగర్ ఎల్డి ఎం ఆంజనేయులు మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని,వారికి కావలసిన ఉపాధి అవకాశాలను ఏర్పరుచుకోవాలని,శిక్షణ అనంతరం మా యొక్క బ్యాంకుల ద్వారా మగ్గం వర్క్ షాప్ ఏర్పాటు చేసే మహిళలకు జె ఎల్ జి గ్రూపుల ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.మహిళా సంఘాలకు ఎక్కువ మొత్తంలో ఎలాంటి పూచికత్తులు లేకుండా బ్యాంకులో రుణాలను శ్రీ శక్తి కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ కృష్ణ మా బ్యాంకు ద్వారా మగ్గం వర్క్ నేర్చుకున్న వారికి లోన్స్ ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి పెండ్లి సంపత్ కుమార్, జన వికాస కోఆర్డినేటర్ రాజు జనవికాస ట్రైలర్ మనీషా, మగ్గం వర్క్ బైరైడ్ ట్రైనర్ సూర్య కుమారి, 60మంది మహిళా సంఘాల సభ్యులు, సిఏలు వివోఏ జ్యోతి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.