
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త బత్తుల మనోజ్ ఉమాదేవిల కోడలు బత్తుల మానస జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కాగా పట్టణ ప్రముఖులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. చిన్నతనము నుండే చదువు మీద పట్టు ఉండి ఉన్నత లక్ష్యం నెరవేరాలని ఎంతో కష్టపడి సివిల్ జడ్జ్ గా ఎంపిక కావడం హుజురాబాద్ ప్రాంతానికి గర్వకారణం అని, ప్రతి వ్యక్తి ఉన్నత లక్ష్యంతో చదివితే ఏదైనా సాధించవచ్చు అని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మానసను అభినందిచారు. అంబెడ్కర్ రాజ్యాంగంలో మహిళల అభివృద్ధి కోసం
ఎన్నో హక్కులు పొందు పరిచిన వాటిని సద్వినియోగం చేసుకుని
మహిళలు రాణించాలని వక్తలు అభిప్రాయ పడ్డారు.
విద్యానగర్ లోని తననివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాక సతీష్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, డిటిఎఫ్ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, రుద్రారపు కుమార్, మాల మహానాడు నాయకులు పసుల స్వామి, తూము వెంకటరెడ్డి, టి.మాధవరావు, సందెల వెంకన్న, తాళ్లపెళ్లి అమరేందర్, అంబాల రవీందర్, ఆకుల చందర్, చిలుకమారీ సత్యరాజ్, సామాజిక నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మానసను సన్మానిస్తున్న దళిత, ప్రజా సంఘాల నాయకులు..