
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన తాపీ మేస్త్రి సగర ఉప్పర కుటుంబానికి చెందిన కురిమిండ్ల నారాయణ ఇటీవల మరణించగా ఈ విషయం తెలియగానే మండలంలోని సింగాపూర్ కు చెందిన జయన్న పౌండేషన్ చైర్మన్ జీ జైపాల్ రెడ్డి వారి కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యము 5వేల రూపాయలు నగదు అందజేశారు. జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం పెద్దలు కొల్లూరి బుచ్చయ్య, కానిగంటి శ్రీనివాస్, కురుమిళ్ళ రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇమ్మడి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.


కురిమిండ్ల నారాయణ కుటుంబానికి బియ్యం, నగదు అందజేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్న జయన్న ఫౌండేషన్ నిర్వాహకుడు జైపాల్ రెడ్డి..