
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 25: జూలై 3 నుండి 14వ తేదీ వరకు ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరగనున్న 15వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ – 2025 టోర్నమెంట్ కోసం హుజూరాబాద్‌కు చెందిన తాళ్లపల్లి మేఘన, జంపాల శివ సంతోషిని జాతీయ సబ్ జూనియర్ ఉమెన్స్ హాకీ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, కార్యదర్శి బోడిగే తిరుపతి, జిల్లా హాకీ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, జిల్లా ఇంచార్జ్ సెక్రటరీ తారీక్ హైమద్ వీరిద్దరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఎంపిక కావడం హుజూరాబాద్ క్రీడా రంగానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. మేఘన, శివ సంతోషినిల ప్రతిభను హాకీ అసోసియేషన్ సభ్యులు ప్రశంసించడమే కాక, భవిష్యత్‌లో వారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

జాతీయ హాకీ జట్టుకు ఎంపికైన మేఘన, శివ సంతోషిని





