
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వ్యక్తులఫై హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కొందరు వ్యక్తులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి NPDCL మరియు NTPC ల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువకులను నమ్మించిన విషయంలో హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక నిరుద్యోగ బాధితుని యొక్క ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్. 207 /2025. U/Sec.318(4) ,336(1), 338,336(3) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే…నిందితులు.
A1మాడుగుల ప్రవీణ్ r/o హుజురాబాద్, A2 గుండెల్లి సంజీవ్ r/o హుస్నాబాద్, A3 యంసాని వీరేశం r/o హుజురాబాద్ మరియు మరికొందరు తెలియని నేరస్థులు ఒక గ్రూపుగా ఏర్పడి NPDCL, NTPC, ఫారెస్ట్, పోస్టల్ డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్ మరియు అటెండర్ స్థాయి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రాంతానికి చెందిన మాడుగుల ప్రవీణ్ అనే వ్యక్తి బాధితున్ని పరిచయం చేసుకుని, తనకు TGNPDCL (విద్యుత్ శాఖ)లో పెద్ద అధికారులతో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలనని ప్రవీణ్ నమ్మించి మరి కొంతమంది నిరుద్యోగ ఆశావాహులను, సంజీవ్, వీరేశం నమ్మించి బాధితులు అందరినీ రామగుండంకు తీసుకువెళ్లి అక్కడ వారి యొక్క సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను తీసుకొని వారికి నిందితులు ముందుగానే తయారు చేసుకున్న ఫార్మాట్లో బాధితుల పేర్లతో ఒక నియామక పత్రాన్ని(తప్పుడు) సృష్టించి బాధితులకు అందజేశారు. అప్పటికప్పుడు ఖర్చుల నిమిత్తం బాధితులు దగ్గర నుంచి తల కొంత డబ్బులు తీసుకున్నారు. ఒరిజినల్ ఆర్డర్ కాపీ పోస్టులో వస్తుందని తదుపరి ప్రతి వ్యక్తి ఉద్యోగం కోసం రూ. 5,00,000/- నుండి 8,00,000-/ వరకు చెల్లించాల్సి ఉంటుందని నమ్మించాడు. గతంలో చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించామని మరియు ఈ విషయాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. బాధితులు తనకు తెలిసిన వారికి అట్టి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ను చూపించగా అది తప్పుడు దృక్పత్రము అని తేలడంతో బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. తరువాత విచారణలో మాడుగుల ప్రవీణ్, గుండెల్లి సంజీవ్ (హుస్నాబాద్) మరియు యమ్సాని వీరేశం (చిన్నపాపయ్యపల్లి) లతో కలిసి విద్యుత్, అటవీ మరియు NTPC, పోస్టల్ డిపార్ట్మెంట్ విభాగాలలో ఉద్యోగాల పేరుతో అనేక మంది ఉద్యోగార్థులను మోసం చేశారని మరియు వారిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
నిరుద్యోగ యువతకు తెలియజేయునది ఏమనగా ప్రభుత్వం ద్వారా ఏ యొక్క ఉద్యోగం కూడా నోటిఫికేషన్ లేకుండా నియమాకాలు జరగవు ఇలాంటి దళారులను నమ్మి మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాము. ఫై విధంగా ఎవరినైనా ఫై వ్యక్తులు మోసగించినచో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించగలరు లేదా హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు అని సదుల్లాబాబా ఇన్స్పెక్టర్ విజిలెన్సు & NPDCL కరీంనగర్ తెలిపారు.


