మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU) రాష్ట్ర కమిటీ సమావేశం సికింద్రాబాద్ లో సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా DMJU వ్యవస్థాపకులు ఎంపెల్లి ముతేష్, రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్రప్రసాద్, జాతీయ నాయకులు చందా శ్రీనివాస్ లు మాట్లాడుతూ డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం గత నెల సెప్టెంబర్ 20 న DMJU ఆవిర్భావించిందని, నవంబర్ 15 న మహబూబాబాద్ లో ఆవిర్భావ సభ, జెండా ఆవిష్కరణ కార్యక్రమంను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతీ డిజిటల్ మీడియాలో పని చేస్తున్న వారిని జర్నలిస్ట్ గా గుర్తించి అక్రీడిటేషన్ కార్డు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో DMJU ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బలోపేతం చేసి డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కార సాధనలో ముందుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యుగేందర్, కర్ణ కుమార్, కే చెన్నయ్య, కోరే శ్రీనివాస్, ప్రవీణ్, సునీల్ చంద్ర, సంపత్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
- Home
- డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. -నవంబర్ 15న డిఎంజెయు ఆవిర్భావ సభ, జెండా ఆవిష్కరణ.. -రాష్ట్ర కమిటీ సమావేశంలో వెల్లడి