Oplus_131072
–నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడుతా..
–వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తా..
–నవంబర్ 6లోపు ప్రతి పట్టభద్రుడు విధిగా ఓటు నమోదు చేసుకోవాలి
–లక్షెట్టిపెట్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (లక్షేట్టిపేట్:) రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను ఎమెల్సీగా ఆశీర్వదించి గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తూ
అందరికి అందుబాటులో ఉంటానని లక్షెట్టిపెట్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి వెల్లడించారు…సోమవారం లక్షెట్టిపేట్ లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు హై స్కూల్, జూనియర్, డిగ్రీ ,KGBV ,ఆదర్శ పాఠశాలలతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు.
అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలోని ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా నిరుదోగులకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై మండలిలో గలమెత్తుతానని అన్నారు. విద్యారంగ సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించి వారు సులువుగా ప్రయివేట్, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా అందులో శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంటు బకాయిలను విడుదలకు కృషి చేస్తానని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేయిస్తానని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ప్రతి ఏడాది ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు… గతంలో ఎమ్మెల్సీ పదవిని రాజకీయాల కోసమే వాడుకున్నారని అన్నారు.. ఎమెల్సీగా ఆశీర్వదిస్తే సేవకుడిగా పని చేస్తూ అందరికి అందుబాటులో ఉంటానని వెల్లడించారు… మోడల్ స్కూల్ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.. పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులు గ్రంథాలయాలకు వెళ్లి అందరూ చదువుకోలేరు కాబట్టి వారి సౌకర్యార్థం ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ యాప్ లో దేశంలోని అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు..






