Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను ఎమెల్సీగా ఆశీర్వదించి గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తూ అందరికి అందుబాటులో ఉంటానని వెల్లడించారు. కరీంనగర్ పట్టణంలో పలు పాఠశాలలో ప్రచారం నిర్వహించి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా నిరుదోగులకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంపొందించి వారు సులువుగా ప్రయివేట్, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా అందులో శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను విడుదలకు కృషి చేస్తానని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేయిస్తానని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ప్రతి ఏడాది ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ పదవిని రాజకీయాల కోసమే వాడుకున్నారని అన్నారు. ఎమెల్సీగా ఆశీర్వదిస్తే సేవకుడిగా పని చేస్తూ అందరికి అందుబాటులో ఉంటానని వెల్లడించారు. మోడల్ స్కూల్ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులు గ్రంథాలయాలకు వెళ్లి అందరూ చదువుకోలేరు కాబట్టి వారి సౌకర్యార్థం ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ యాప్ లో దేశంలోని అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.







