
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బస్టాండ్ లో సమయానికి బస్సులు రాక వందలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంకు తోడుగా దీపావళి పండుగ కావడంతో ప్రజలు తమ చుట్టాల, పుట్టింటికి వచ్చి తిరిగి స్వగ్రామాలకు, అత్తగారింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో కరీంనగర్- వరంగల్ జిల్లాలకు మధ్యలో హుజురాబాద్ బస్టాండ్ ఉండడంతో వందలాదిమంది ఒకేసారి రావడంతో బస్సుల రాక కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అధికారులు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో నాన అగచాట్లు పడాల్సి వస్తుందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి సైతం సుమారు మూడు నాలుగు వేల మంది ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు వేచి చూడగా అర్ధరాత్రి వరకు కూడా బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో చాలామంది తిరిగి ఇంటికి వెళ్లి మళ్లీ ఉదయం వెళ్లేందుకు సిద్ధమై వచ్చారు. అంతేకాకుండా ఉద్యోగులకు వర్కింగ్ డే కావడంతో వివిధ ప్రాంతాలలో ఆఫీసులకు చేరుకునేందుకు నిత్యం ఉదయం బస్టాండుకు రావడం ఆనవాయితీ గా వస్తుంది. అయినా మళ్లీ రాత్రి పరిస్థితి ఎదురు కావడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల తీరుపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఉచిత బస్సుల పేరుతో ప్రభుత్వం మహిళలకు సౌకర్యం కల్పించిన ఆమెకు అవసరమైన బస్సుల ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు, పిల్లలు, యువతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు చేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.











