
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో ట్రాక్టర్ల అద్భుతమైన ప్రాముఖ్యతను గుర్తించేందుకు మరియు ట్రాక్టర్ యజమానుల అంకితభావాన్ని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం నవంబర్ 6న “ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం”ని జరుపుకోవాలని ప్రతిపాదన వచ్చిందని”ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం” ప్రతిపాదన: ట్రాక్టర్ యజమానుల కృషికి గౌరవం..వ్యవస్థాపక అధ్యక్షుడు పాడి రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది వ్యవసాయ రంగంలో ఒక కొత్త సంచలనానికి దారి తీసే అవకాశం కలిగించే రోజు. ఈ దినోత్సవం ద్వారా ట్రాక్టర్ల అద్భుత కృషిని గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలను బలపరిచే విధంగా దీనిని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం. “ట్రాక్టర్లు ఆధునిక వ్యవసాయాన్ని సమూలంగా మార్చాయి,” పొలాలను దున్నడం, విత్తనం చల్లడం, పంటలను రవాణా చేయడం వంటి ఎన్నో కీలక పనుల్లో ట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు ఖండాల్లో ఇవి వ్యవసాయ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా, ఈ యంత్రాలు సంవత్సరంలో 11 నెలల పాటు నిరంతరాయంగా పని చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి,” అని వివరించారు.
నవంబర్ 6న జరుపుకోవడానికి ఈ తేదీకి ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఉంది. “6 అంకె ఆరు ఖండాలను సూచిస్తుంది, మరియు 11 అంకె ట్రాక్టర్లు 11 నెలల పాటు పనిచేసే విషయాన్ని గుర్తుచేస్తుంది,” అని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దినోత్సవం ద్వారా ట్రాక్టర్ యజమానుల అంకితభావాన్ని గౌరవించడం మాత్రమే కాదు, ప్రజల్లో కూడా వారి కృషి పట్ల గౌరవభావాన్ని పెంపొందించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. “ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం” ను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (UNO) ద్వారా గుర్తింపునిచ్చేందుకు సర్వత్రా కృషి జరుగుతోందన్నారు. ప్రతిపాదిత దినోత్సవం ద్వారా వ్యవసాయ రంగానికి ఈ ట్రాక్టర్లు అందించే అపార సహకారాన్ని గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా రైతులు మరియు ట్రాక్టర్ యజమానుల జీవితాలను సురక్షితంగా ఉంచడంలో సహకరించే దిశగా దీనిని పరిగణిస్తున్నారని పంటలు సాగు చేసేది మనము ప్రపంచాన్ని పోషించేది మనము అని పేర్కొన్నారు.







