
–రైతు వేదిక సాక్షిగా.. రైతును దూషించావు..” కౌశిక్ రెడ్డి”
–అధికార దాహంతో..రైతులను దూషించావు..!
–ఈరోజు ఇంకా రైతులను పక్కన కూర్చొపెట్టుకుని కపట ప్రేమ చూపిస్తున్నావు...
–మీ బి.ఆర్.ఎస్ పాలనలో జమ్మికుంట మార్కెట్ చైర్మన్ గా దళితులను నియమించకుండా చేసి పత్తికి మద్దతు ధర దక్కకుండా రైతుల మోసం చేసింది నీవు కాదా.!
–BRS ప్రభుత్వంలో రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయకుంటే అలసిపోయి గుండె వరిబస్తాలపై పడి మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
–రాష్ట్రంలో ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
–సబ్బండ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది.
–ఉద్యమ ద్రోహి..ఉద్యమ పార్టీఅని చెప్పుకునే BRS లో ఎలా కొనసాగుతున్నాడో.. మీ నాయకులు చెప్పాలి
–ఉద్యమకారులకు అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ మాది..!
తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ..
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిఆర్.ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్ పదవిలో ఉండి రైతు వేదిక సాక్షిగా రైతు బిడ్డను ఏం పీక్కుంటావో పీక్కో అన్న మాటలు చరిత్రలో తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని, హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మీ పార్టీ అధికారంలో ఉన్న హయాంలోనే సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందని, సుమారు ప్రతి మిల్లులో ప్రభుత్వానికి బకాయి పడ్డారని అందుకే ఈసారి బకాయి చెల్లించని మిల్లులకు దాన్యం పంపేది లేదని స్పష్టం చేయడంతో మీ లాంటి వాళ్లతో చిల్లర రాజకీయాలు చేపిస్తున్నారని, రైతును రాజును చేసిన గణ చరిత్ర కాంగ్రెస్ పార్టీ దని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది మీ పార్టీ, ప్రభుత్వమేనని.. రాజకీయ అవసరాల కోసం దిగజారి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన ఘనత కౌశిక్ రెడ్డికి దక్కుతుందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి తీరుతుందని, రైతులు నీ మాటలను నమ్మి మోసపోయే స్థితిలో లేరని ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని ప్రతి రైతుకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ సన్నాలకు ఇస్తామని.. ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ తప్పక నెరవేరుస్తుందని ప్రణవ్ స్పష్టం చేశారు.






