
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బ్రహ్మకుమారి సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘం అని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక అన్నారు. సోమవారం పట్టణంలోని బ్రాహ్మ కుమారి సంస్థ భవన రెనోవేషన్ కార్యక్రమానికి చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడారు. రాజయోగ మెడిటేషన్ ద్వారా మనశ్శాంతి పొందవచ్చునన్నారు. బ్రహ్మ కుమారీస్ కేంద్రాలు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయన్నారు. ప్రజలందరూ పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ఠ కలిగి ఉండాలన్నారు. సంస్థకు తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు కల్పన, శ్రీవాణి, జ్యోతిరాణి, రాజయ్య, ఈశ్వరయ్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.







