
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో పేకాట స్థావరాలపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు.
జమ్మికుంట పట్టణంలో కట్ మండి శ్రీనివాస్ ఇంట్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్న 8 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా ముగ్గురు పరారీ అయ్యారని పోలీసులు తెలిపారు. కాగా
ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్న వారినుండి రూ.30680 ల నగదు, 4 సెల్ ఫోన్ లను స్వాదినం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో పలువురు ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.





