
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే మార్చుకుంటున్నారు తప్ప దళితులకు దళిత బంధు రెండవ విడత ఇవ్వడంలో నాన ఇబ్బందులకు గురి చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. 2022 డిసెంబర్లోనే రెండో విడతకు గ్రౌండింగ్ అయి పేమెంట్ అయ్యే స్థితిలో అప్పటి బిఆర్ ఎస్ ప్రభుత్వం మంజూరు చేయకుండా వాళ్ళ అకౌంట్ లో ఉన్న పైసలు వారికి ఇవ్వకుండా జాప్యం చేసి వారిని ఆఫీసుల చుట్టూ తిరిగే విధంగా చేసిందని, అప్పుడే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి గాని, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న బండ శ్రీనివాస్ గాని దళితుల రెండో విడత మంజూరులో ఎలాంటి సహాయం చేయలేదు అన్నారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపింది అని దళితుల ఓట్లు వేయించుకొని నేనే పెండింగ్లో ఉన్నవి ఇప్పిస్తా నా ఇంటికి రా అని దళితులను ఆందోళనకు గురి చేస్తున్నారని కరుణాకర్ ఆరోపించారు. ఎన్ని రెండో విడత రావాలో మీ దగ్గర సమాచారం లేదా ఎందుకు దళితులను నీ ఇంటికి పిలుచుకొని రాజకీయం చేయాలని చూస్తున్నావ్ కౌశిక్ రెడ్డి అన్నారు. దళితులపై చిత్తశుద్ధి నీకు ఉంటే వెంటనే అన్ని మండల పరిషత్ లో గ్రౌండ్ అయినవి కావాల్సినవి లిస్టులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దగ్గర ఉన్నవి వాటిని తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి లేదా మీ సమీప బంధమైన ఉత్తంకుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లి తక్షణమే దళితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబుకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాదాపు 11 నెలలు కావస్తుంది ఇప్పటివరకు దళిత బంధు విషయంలో జిల్లా మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో దళితులంతా రెండో విడత కోసం ఆందోళనలో ఉన్నారన్నారు. తక్షణమే వారి ఆందోళన నివృత్తి చేసే విధంగా రెండో విడత ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన ప్రకటన జిల్లా మంత్రితో స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే మీరు ఆ దిశగా ప్రయత్నం చేసి దళితుల ఆందోళన నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, ఏ ప్రభుత్వం అయినా వారి అకౌంట్లో ఉన్న పైసలను వారికి ఇవ్వడానికి రాజకీయం చేయడం వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు జిల్లా మంత్రులపై ఒత్తిడి తెచ్చి దళిత బంధు రెండో విడత వచ్చే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కరుణాకర్ డిమాండ్ చేశారు.






