
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
దళితులకు రాజ్యాధికారానికి దూరం చేయలనే కుట్రతోనే ఎస్సీలను ఏబిసిడి లుగా వర్గీకరిస్తూ మాలలను అణచివేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆరోపించారు. మాల మహానాడు పాదయాత్రలో భాగంగా శుక్రవారం హుజురాబాద్ మండలంలోకి పాదయాత్ర ప్రవేశించింది. పర్కాల క్రాస్ రోడ్ లో స్థానిక మాల మహానాడు నాయకులు, మహిళలు మంగళహారతులతో మహా పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హుజురాబాద్ వరకు సాగిన పాదయాత్ర పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పిల్లి సుధాకర్ పూలమాలలు వేసి మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణమాదిగ ప్రధాని నరేంద్ర మోడీ కౌగిలిలో ఇరుక్కుని మనువాదుల ఏజెంట్ గా మారారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ బద్దంగా జరగలేదని న్యాయస్థానాలు మనువాదుల జేబు సంస్థలుగా మారాయని ఆయన విమర్శించారు. న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిన వెంటనే రాష్ట్రంలో అమలు సాధ్యమా..?కాదా ..?అనే విషయాన్ని పరిశీలించకుండా వర్గీకరణను వెంటనే అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికి ఆయన తప్పుపట్టారు. ఏ రీతిన వర్గీకరణ చేపడతారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో మాలలు, మాదిగలు జనాభా పరంగా సమానంగా ఉన్నారని, అయినా మాలలను తక్కువ చేసి చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను తరిమికొట్టేందుకు మాలల సిద్ధంగా ఉండాలని పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఎస్సీలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మాలాల జనాభా తక్కువ అని అసంబద్ధ శాస్త్రీయమైన లెక్కలు చూపిస్తూ రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను ఒక వర్గం పనిగట్టుకొని తప్పుదారి పట్టిస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నుండి దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, అంబేద్కర్ స్కాలర్ షిప్స్, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, గురుకుల సీట్లు ఎవరు ఎక్కువగా ఉపయోగించుకున్నారో శాస్త్రీయమైన ఆధారాలతో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 38 రోజులపాటు 16 జిల్లాలో 35 నియోజకవర్గాల మీదుగా వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం డిసెంబర్ 1న హైదరాబాద్ కు చేరుకుంటుందని హైదరాబాదులో నిర్వహించే మాలల సంగ్రామ యాత్రకు లక్షల మంది మాలలు, మాల ఉపకులాలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మర్రి వెంకటస్వామి, మాల మహానాడు నాయకులు మేడి అంజయ్య, వెన్న రాజు, ఎలుక దేవయ్య, చిట్టి మల్ల సమ్మయ్య, నాగరాజు, సొల్లు బాబు, పాక సతీష్, యేముల పుష్పలత, తొగరు స్వామి, పసుల స్వామి, తొగరు బిక్షపతి, సమ్మయ్య, పిట్ట శ్రీనివాస్, సదానందం, నరసింగం తదితరులు పాల్గొన్నారు.








