
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్) నవంబర్ 8: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ గా పనిచేస్తున్న అనగోని తిరుపతి గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయాన్ని తెలుసుకొని శుక్రవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వోడితేల సతీష్ కుమార్ సందర్శించి ఆయనను పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి కారణాలను తిరుపతి గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాసేవలో భాగస్వామి కావాలని సతీష్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బిల్లా వెంకట్ రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి. సుద్దాల నర్సింగ్, గ్రామ శాఖ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


