
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గొప్పగా సేవ చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు
