
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పవిత్ర ఖురాన్ బోధనలను అనుసరించాలని మదర్స దారుల్ ఉలుూమ్ హుజురాబాద్ సభ ద్వార మౌలానా ఖారి ఒసామా ఫలాహి పిలుపునిచ్చారు. హుజురాబాద్ మోమిన్ పురలో ఆదివారం మదర్సా దారులు హుజురాబాద్ లో ముఫ్తి ఘయాజ్ మోయుద్దిన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మనిషి జీవితం సక్రమంగా జరగాలంటే ఇహ పరలోకాల సాఫల్యం పొందాలంటే ప్రతి మనిషి ఖురాన్ ని అనుసరించాలని తెలిపారు. మరియు మొబైల్ వాడకం వలన యువతీ యువకులు పెడదారిన పడుతున్నారని, అశ్లీల చిత్రాలు అబద్ధపు మాటలు విచ్చలవిడి అయ్యాయని చెప్పారు. అయితే మొబైల్ ఫోన్ వాడకం చెడు పనులకే కాకుండా కేవలం మంచి పనులకే వాడితే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మదర్సా కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఖురాన్ కంఠస్థం పూర్తి చేయడం చాలా సంతోషకరమని మరియు హఫిజ్ ఎ ఖూరాన్ లను గౌరవించాలని తమ పిల్లలను కూడా మదర్సాలో చేర్పించి హాఫిజ్ ఎ ఖూరాన్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ నయీమ్ (మదర్సా ప్రిన్సిపల్) మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హుజురాబాద్ జామ మజీద్ అధ్యక్షులు, ముఫ్తి షాకిర్, హఫీజ్ ఫహీం, హఫీజ్ కలీం, హఫిజ్ రిజ్వాన్, హాఫిజ్ అబ్దుల్ రజాక్, అహ్మద్, ఫరీద్, ఇమ్రాన్, సహల్ సోహెల్, షేక్ ఫయాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

