
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సారెస్పీ ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ…కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కి యువజన కాంగ్రెస్ నేత టేకుల శ్రావణ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున సైదాపూర్ రోడ్డులో గల ఎస్సారెస్పీ ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని ఎస్సారెస్పీ డివిజన్ (1) పరిధిలో గల ప్రభుత్వ భూమి ఎడమ, కుడి కాలువకు ఇరువైపులా భూములు కబ్జా చేసి యదేచ్చగా మున్సిపల్ కార్యాలయం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపారు. ఇదంతా జరుగుతున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని అన్నారు. ఇట్టి విషయమై హుజురాబాద్ ఆర్ డిఓ కి ఫిర్యాదు చేసినట్టు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిపారు. ఎస్సారెస్పీ ఎడమ, కుడి వైపుల కొన్ని ఎకరాలు అక్రమించుకున్నారని అట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకొని అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. ఈ విషయమై హుజురాబాద్ ఆర్ డిఓ కి ఫిర్యాదు చేసినట్టు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిపారు. తప్పకుండా ఈ విషయం పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు శ్రవణ్ తేలిపారు.
