మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రసూతి వైద్యం కోసం హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యుల నిర్లక్ష్యానికి గర్భములోనే శిశువు బలైంది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం .. వివరాల్లోకి వెళితే..కరీంనగర్ కు చెందిన కళ్లెం లక్ష్మి ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం హుజురాబాద్ బుడిగ జంగము కాలనీలోని తన తల్లి గంధం రాజేశ్వరి వద్దకు వచ్చి, ఇక్కడే ఉంటూ రెగ్యులర్ గా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటుంది. లక్ష్మికి గురువారం రోజున సాయంత్రం పురిటినొప్పులు రావడంతో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పిన వైద్యులు సమయానికి చికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పుట్టిన ఆడ శిశువు మృతి చెందిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాత్రి మృతి చెందిన శిశు మృతదేహంతో బాధితురాలు లక్ష్మీ భర్త కళ్లెం నాగరాజు, తల్లి రాజేశ్వరి, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. తమ పురిటి బిడ్డ మృతికి కారణమైన హుజురాబాద్ ప్రభుత్వ వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు తల్లి రాజేశ్వరి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వైద్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, మృత శిశువుకు రీ పోస్టుమార్టం చేసి నిజాలను వెలుగులోకి తీసుకువస్థామని పోలీసులు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
error: Content is protected !!