
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కూరపాటి హాస్పిటల్ వారు శనివారం వరల్డ్ పైల్స్ డే నీ పురస్కరించుకుని ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత జీవన శైలిలో అనేక మార్పులు తీసుకునే ఆహారంలో మార్పుల వలన మలబద్దకo మరియు దాని వలన పైల్స్ సంబంధిత ఇబ్బందులు ఎక్కువ అయ్యాయన్నారు. మధుమేహానికి సంబంధించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో దాదాపుగా 100 నుండి 150 మందికి బి.పి మరియు షుగర్ సంబంధిత పరీక్షలు చేయడం జరిగింది. వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పైల్స్ గురించి ప్రజలలో అవగాహన పెంచటానికి డా. కూరపాటి రమేష్, డా. కూరపాటి రాధిక, డాక్టర్ K. సుధాకర్, మరియు కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ మరియు walkers సభ్యులచే గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.










