Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వైద్యుల నిర్లక్ష్యం మూలంగా పుట్టిన పసిపాప మృతి చెందిన ఆరోపణ నేపథ్యంలో శనివారం హుజురాబాద్ కేసి క్యాంప్ వద్ద మృతి చెందిన పసిపాప మృతదేహానికి అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కోసం కళ్లెం లక్ష్మి వచ్చిందని పురిటి నొప్పులతో ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించడంతో పుట్టిన శిశు మృతి చెందిందని లక్ష్మీ కుటుంబ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ కేసు నమోదు చేసుకున్నారు. కాగా శనివారం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ డాక్టర్ సురేందర్ హుజురాబాద్ తాసిల్దార్ కే కనకయ్య, సిఐ తిరుమల్ గౌడ్ ఇతర వైద్య సిబ్బంది కుటుంబ సభ్యుల సమక్షంలో పసిపాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికను ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని వారు తెలిపారు.






