
Oplus_131072
- చెన్నై పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్లో ఆశ్రయం… వల పన్ని పట్టుకున్న పోలీసులు
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, నవంబర్ 16 : చెన్నైలో స్థిరపడిన తెలుగు వారిపై చెన్నైలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని శనివారం హైదరాబాద్లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై చెన్నైలో పలు కేసులు నమోదవగా.. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్కి వచ్చి ఆశ్రయం పొందుతున్న ఆమెని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు.
తెలుగువారిపట్ల దురుసుగా మాట్లాడడమే కస్తూరి అరెస్ట్ కు కారణం!?
నవంబరు 3న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి.. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల కిందట రాజు గారి అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని.. వాళ్లు ఇప్పుడు తాము తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారంటూ కస్తూరి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారంటూ కూడా కస్తూరి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు పకడ్బందీ వలపన్ని పక్క సమాచారంతో అరెస్టు చేసి చెన్నైకి తరలించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశముగా మారింది.

