
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోనీ వివిధ ప్రాంతాల్లో దళిత బందు దళితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణం అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు కుటుంబసభ్యులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని, దళితుల హక్కులను కాపాడాల్సిన పోలీసులే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఈ అరెస్టును తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. వారి న్యాయమైన హక్కులను గుర్తించి, వెంటనే వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా చేయకపోతే, ప్రజలందరితో కలిసి పెద్దఎత్తున ఆందోళనలకు దిగడం తథ్యంఅని, హుజురాబాద్ ప్రజల గౌరవం, దళితుల హక్కుల పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుందనీ ఆయన అన్నారు.






