
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని దమ్మక్కపేటకు చెందిన కొండబత్తిని రాజేశ్వరి (65) సోమవారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామ శివారులో వ్యవసాయ బావి కావడంతో దానిలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఉదయం నుండి సాయంత్రం వరకు ఫైర్ ఇంజన్ సహాయంతో మోటర్లు పెట్టి నీటిని తోడారు. రాజేశ్వరి భర్త రాజాకిషన్ గత 14 సంవత్సరాల నుండి పెరాలసిస్ తో బాధ పడుతున్నారన్నారు. దానితో మనస్థాపం చెందిన అమే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు అని అంటున్నారు. ఆమెకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గజ ఈతగాళ్ళ సహాయంతో సాయంత్రం వరకు బావిలో మృతదేహం కోసం గాలిస్తున్నారు.






