
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ మండలంలోని బోర్నపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉత్తమ సొసైటీగా ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీలో గురువారం జిల్లా మత్స్యశాఖ అధికారులు బోర్నపల్లి మచ్చ పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గంటా శ్రీనివాస్ కు పాలకవర్గ సభ్యులకు ప్రశంస పత్రం అందజేసి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఉత్తమ సొసైటీగా ఎంపిక కావడం పట్ల బోర్నపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మత్స్యకారులు హర్ష వ్యక్తం చేశారు.






