ముస్లిం కబ్రిస్తాన్ పేరు పహాని ధరణిలో నమోదు చేయండి.. -హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్ ఆర్డీవో, తాసిల్దార్లకు వినతి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో నివసిస్తున్న ముస్లిం సోదర సోదరీలు ఎవరైనా మరణించిన వారిని ఖనాన సమాధి చేయడానికి స్థలము లేక కొన్ని సంవత్సరాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఖనాన సమాధి చేయడానికి ఒక ఎకరం 10 గుంటల ప్రభుత్వ స్థలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించటం జరిగిందనీ, దీనిలో ఇప్పటివరకు కొంతమందిని ముస్లిం ఖనన సమాధి చేయటం కూడా జరిగింది కనుక ఆ స్థలాన్ని ముస్లిం కబ్రుస్తాన్ గా పహానిలో మరియు ధరణిలో పేరు నమోదు చేయాలని గురువారం హుజురాబాద్ రెవిన్యూ డివిజన్ అధికారి ఎస్ రమేష్ బాబు, హుజురాబాద్ మండల తాసిల్దార్ కే కనకయ్యలకు హుజురాబాద్ జమే మస్జిద్ ఈద్గా కబ్రుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు ముస్లిం నాయకులు మహమ్మద్ హబీబ్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, మహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మొహమ్మద్ హర్షత్, మహమ్మద్ యాసిన్ ఖాన్, మహమ్మద్ తాజుద్దీన్ బాబా, మహమ్మద్ అహమతుల్లా ఖాన్, మహమ్మద్ అంజ దౌ జమీల్ అహ్మద్ ల ఆధ్వర్యంలో అధికారులకు జామే మస్జిద్ ఈద్గా కబ్రుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున వినతి పత్రంలు అందించటం జరిగిందని అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రాధిక, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యలకు జామే మస్జిద్ ఈద్గా కబ్రుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ ఒక వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈద్గావరణములో సెంటర్ లైటింగ్ మరియు కొత్త ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణములో సెంటర్ లైటింగ్ తో పాటు ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా మురికి కాలువ కొత్తగా వెంటనే నిర్మాణం చేపట్టాలని చైర్మన్, కమిషనర్లకు రిప్రజెంటేషన్ గతంలో ఇవ్వటం జరిగిందన్నారు. ఇచ్చిన వెంటనే హుజురాబాద్ మున్సిపల్ పాలకవర్గం సమావేశంలో మస్జిద్ కమిటీ వారు ఇచ్చిన పనులకు సంబంధించిన దానిని మున్సిపల్ సమావేశంలో పాలకవర్గం సభ్యులు తీర్మానం చేసినందుకు వారికి మస్జిద్ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. కానుక తీర్మానం చేసిన పనులను మునిసిపల్ చైర్మన్ రాధికతో పాటు మున్సిపల్ సభ్యులు మరియు మున్సిపల్ కమిషనర్ వెంటనే నిధులను మంజూరు చేసి వచ్చే రంజాన్ నెలలోపే ఈ పనులను చేపట్టాలని హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

Oplus_131072

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!