
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి యాదాద్రి భువనగిరి: తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ మరియు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుని కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా పిలాయిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ ఎరుకల కుటుంబానికి చెందిన కూతాటి ప్రేమలత యాదగిరి పూరిగుడిసెను కూల్చేసిన భూ కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కోరుతూ తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు వినతి పత్రం అందజేశారు. బాధితులకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. వెంటనే కలెక్టర్ స్పందించి స్థానిక ఆర్డిఓకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని రాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఆర్డీవో గారికి ఆదేశాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ కి తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ మరియు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకినీ రాజు, ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం, తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుతాడి రవికుమార్, కోశాధికారి వనం రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాడి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరాకుల శ్రీనివాస్, పాతపల్లి నరసింహ, దేవరాయ యాదగిరి, బదనపురం శ్రీరాములు, కుతాడి మహేష్ఉండ్రాతి రవి, కూతాడి సంతోష్, కూతాడి శ్రీనివాస్, కూతడి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.



