
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత 20 సంవత్సరల తరవాత బలమైన భూకంపం 5.3 ఈ రోజు తెలంగాణ లో కనిపించింది. మేడారం అడవుల్లో…గోదావరి నది పరివాహక ప్రాంతాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల భూ ప్రకంపనలు కనిపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఆంధ్రాలోని విజయవాడ జగ్గయ్యపేట పట్టణాల్లో స్వల్ప భూప్రకంపనలు జరిగాయి. కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక ఇల్లందకుంట, మొగుళ్ళపల్లి, రేగొండ ఏరియాలో స్వల్ప భూకంపం కనిపించింది. జమ్మికుంటలో ఈరోజు ఉదయం 7:25 ని. సమయంలో భూమి కదిలినట్టు అనిపించడంతో ఇంట్లో ఉండి భయభ్రాంతులతో బయటికి వచ్చిన ప్రజలు. అలాగే కమలాపూర్ తో పాటు పలు గ్రామాల్లో కొద్ది నిమిషాల ముందు స్వల్ప భూకంప ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.



ఈరోజు ఉదయం 7:27 గంటలకు తెలంగాణ లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది: నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ
తెలంగాణలో భూకంపం.. పలు జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి
తెలంగాణ (Telangana)లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.25 గంటల సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఈ హఠాత్పరిణామంలో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతోందని తెలుసుకునే లోపే అంతా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రగా 5.3గా నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad), ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, హనుమకొండ, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో సుమారు 7 సెకన్ల పాటు భూమి కంపించిట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ మహా నగరంలో 2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి రివర్ బెడ్లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరి ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించినట్లుగా సమాచారం.





