
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్4: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి, హుజూరాబాద్ పట్టణానికి చెందిన భూమ్ బొందయ్య కటుంబ సభ్యులు గోదానం చేశారు. బుధవారం కుటుంబంతో సహా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని, గోమాతను ఆలయ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. గోవులకు భక్తులు తమవంతు సహాయ సహకారాలు విధిగా అందించాలని సూచించారు. అన్ని దానాల్లోకెల్ల గోదానం గొప్పదన్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు భూమ్ లక్ష్మీ, రాము, కృష్ణ, చంటి, స్వప్న, వెంకటేష్, శృతి, ఝాన్సీ, రజితలు ఉన్నారు.






