Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమాజంలో కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపు మాపడానికి, అందరికీ సమాన హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హుజురాబాద్ బస్టాండ్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా రామారావు మాట్లాడుతూ భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా, సాంఘిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ రూప శిల్పిగా, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజా స్వామ్య స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం, అందరికీ సమాన హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన ప్రపంచం మెచ్చే దిగ్గజ నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని సమాన హక్కుల కోసం పోరాడాలని రామారావు పిలుపునిచ్చారు.







