
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజూరాబాద్, డిసెంబర్ 5: మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్ధులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎంఈవో భూపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దివ్యాంగులు అంటే బలహీనులు కారు, విభిన్న సామర్థ్యాలు కలిగిన వారని అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ పథకాల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్ఎంలు, సిబ్బంది, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


