
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్ 5: మత్తు పదార్థాలకు బానిస కాకుండా విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవాలని విద్యార్థులకు హుజూరాబాద్ ఎక్సైజ్ సీఐ టి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని వికాస్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో గురువారం మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మత్తు పదార్ధాలకు బానిస కావడం వల్ల ఉజ్వల భవిష్యత్ నాశనమవుతుందన్నారు. విద్యార్థి దశలోనే మత్తు పదార్ధాలను నిర్మూలించడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వినోద్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ విజేందర్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.






