
-ఎంజెపిటీబి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు.
– విద్యార్థుల్లో ధైర్యాన్ని,భరోసా నింపడానికే ఈ సందర్శన..
– నేరుగా పిల్లలతో మధ్యాహ్న భోజనం.
– సౌకర్యాల విషయంలో పిల్లలకు ఏలాంటి ఇబ్బందులు ఉండొద్దు.
– కలిసి రండి,విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని బీఆర్ఎస్ నాయకులకు సూచన.
–ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో అన్నిరకాల సౌకర్యాలు చేపడుతున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, సైదాపూర్ మండలాల పరిధిలోగల ఎంజెపిబిటి బాలుర పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వసతులపై ఆరాతీసి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. గతానికంటే భిన్నంగా విద్యార్థుల డైట్ విషయంలో అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని, మధ్యాహ్న భోజన విషయంలో ఇంటిని మరిపించేలా మంచి పౌష్టికాహారాన్ని అందజేసేలా కృషి చేస్తున్నామని, పదేళ్లుగా పెరగనటువంటి డైట్, కాస్మోటిక్ చార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 40 శాతం పెంచామని ఇది పేద విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై అవస్థవాలు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో భోజనం చేసిన తర్వాత సౌకర్యాలపై ఆరా తీయాలని సూచించారు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో ఇప్పటికే పలుమార్లు మాట్లాడామని నాణ్యత విషయంలో ఎక్కడ తగ్గకూడదని ఇప్పటికే పలు సూచనలు చేసినట్టు తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి కాంట్రాక్టర్ల సంబంధాలతో ప్రభుత్వంపై బురద చల్లె ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పాఠశాలలను సందర్శించినప్పుడు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారని ఇది బీఆర్ఎస్ నాయకులు గమనించాలని ఆయన కోరారు.





