Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ఈ రోజు(శనివారం) తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కలిసి తెలంగాణ ఆదివాసి ఎరుకల సమస్యలపై 9వ తేదీనాడు జరిగే శాసనమండలి సభలో తమ తరఫున సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు నాయకత్వంలో ఆమెకు వినతి పత్రం అందజేశారు.
పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు; హైదరాబాద్ నిజాంపేట్ లో ఎరుకల ఆత్మగౌరవ భవనంను పూర్తిచేయాలని, పందుల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్న ఎరుకల కుటుంబాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంను యధావిధిగా కొనసాగించాలని, చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినారని, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన సమస్యలను పరిష్కారం కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని,
గత ప్రభుత్వం ఎరుకల నాంచారమ్మ జాతరకు రూ .5 లక్షల బడ్జెట్ కేటాయించినారు కానీ సరిపోలేదనీ, కావున కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల బడ్జెట్ కేటాయించాలన్నారు. ఓరుగల్లు ములుగు జిల్లా రామంజపురం గ్రామంలో కాకతీయ రాజులు 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎరుకల నాంచారమ్మ పంచ కూటాలయం
పుణ:నిర్మించాలని కోరడం జరిగిందని రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతడి రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ,రాష్ట్ర కోశాధికారి వనం రమేష్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్, కేతిరి రాజశేఖర్, దేవరాజు యాదగిరి, బాణాపురం శ్రీరాములు, లోకినీ సమ్మయ్య, మానుపాటి రమేష్, ఓని సదానందం, ఎల్బీనగర్ అధ్యక్షుడు .ఉండ్రాతి రవికుమార్, శివ, సతీష్, మల్లూరు ప్రసాద్, కుతాటి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






